- స్నేహితుడికి తీవ్రగాయాలు
- జగ్గయ్యపేటలో ఘటన
జగ్గయ్యపేట : పట్టణంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి ఓ విద్యార్థి మృతిచెందగా, అతడి స్నేహితుడికి గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్ర కారం.. పట్టణంలోని క్రిస్టియన్ పేటకు చెందిన పె రుమాళ్ల రఘురాం(16), తాటి వంశీ స్నేహితులు. ఇ ద్దరూ ఇటీవల ఇంటర్మీడియెట్‌లో చేరారు. ఆది వారం సాయంత్రం ఇద్దరూ సమీపంలోని పాలేరు నది వద్దకు వెళ్లారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వస్తుండగా వర్షం మొదలైంది. కొద్దిసేపటికి పెద్ద శబ్దంతో పిడుగు వారి మీద పడింది.
ఈ ఘ టనలో రఘురాం అక్కడ కుప్పకూలి పోగా, వంశీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతవాసులు వెంటనే స్పందించి ఇద్దరినీ హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి రఘురాం అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. వంశీకి పళ్లు ఊడిపోవడంతోపాటు తలకు బలమైన గాయమైం ది. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆ స్పత్రికి తరలించారు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ రఘురాం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆర్‌ఐ వెం కటేశ్వరరావు, వీఆర్వో రంగారావు వచ్చి మృతుని వివరాలు సేకరించారు.
ప్రముఖుల నివాళి
రఘురాం మృతదేహాన్ని మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కౌన్సిలర్ జాన్‌బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ ము త్యాల చలం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీ నర్ షేక్‌మదార్ సాహెబ్, మాజీ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్, టీడీపీ యువ నేత శ్రీ రాం ధనుంజయ్ తదితరులు సందర్శించి నివా ళు లర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.