
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో పిడుగు పాటుకు గురై ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. జిల్లాలోని డోంగ్రి గ్రామానికి చెందిన చంద్రపాల్ సింగ్ కన్వార్(47), బుధ్వార్ సింగ్ కన్వర్(50), సుమిత్రా బాయి(55) అనే ముగ్గురు రైతు కూలీలు పొలం పనులు చేస్తుండగా.. భారీ వర్షం పడుతుండటంతో వారంతా సమీపంలో ఉన్న నూతన భవనంలోకి పరుగులు తీశారు.
అదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఆ భవనంపై పిడుగు పడటంతో ముగ్గురు మృతిచెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.