రాములు కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి
మహబూబ్‌నగర్ ,ఖిల్లాఘనపురం (వనపర్తి) : తమ కుటుంబం బాగుండాలని.. వేసిన పం టల దిగుబడి మంచిగా రావాలని.. బంధుమిత్రులతో కలిసి దర్గా దగ్గర కం దూరు చేసేందుకు వెళ్లారు.. బంధువుల పిలుపు మేరకు అక్కడికి వచ్చిన బంధువులు, దర్గాను పూజించేందుకు తండ్రి వెంట వచ్చిన ఓ చిన్నారి బాలుడిపై ప్రకృతి కన్నెర్రజేసింది. ముసురు వర్షంతోపాటు పిడుగుపడి అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందడంతోపాటు మ రో ఇద్దరి పరిస్థితి విషమంగా మారిం ది. ఈ సంఘటన ఖిల్లాఘనపురం మం డలం మానాజీపేటలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..
పొలం దగ్గరికి వెళ్లి..
మానాజీపేట గ్రామానికి చెందిన పాల్కొండ నాగమ్మ బుధవారం తన వ్యవసాయ భూమిలో ఉన్న దర్గా దగ్గర కందూరు చేసింది. ఇందుకు గాను తన ఇంటి చుట్టు పక్కల వారితోపాటు పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామానికి చెందిన రాములు(నాగమ్మ అల్లుడు)ను పిలిచింది. అందరూ కలిసి ఆనందంగా పొలం దగ్గరకు వెళ్లారు. దర్గాను శుభ్రపరిచి.. పొట్టేలును కోసి వంటలు చేశారు. దర్గాకు పాతేహాలు (నైవేద్యం అర్పించడం) ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. పాతేహాలు ఇచ్చేందుకు ముస్లిం వ్యక్తి ఖాజామియా తన ఎనిమిదేళ్ల కుమారుడు సోహెల్‌తో కలిసి అక్కడికి వచ్చారు.
ఎమ్మెల్యే చిన్నారెడ్డి పరామర్శ..
ఖిల్లాఘనపురం మండలంలోని మానా జీపేటలో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందినట్లు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యగార్ ప్రభాకర్‌రెడ్డి వేర్వేరుగా తన సహచరులతో గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని భరోసా కల్పించారు.