పిడుగు పాటుకు శనివారం ముగ్గురు మహిళలు మృతిచెందారు.
మహబూబ్ నగర్: పిడుగు పాటుకు శనివారం ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం ఔసులోను పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు మహిళలు శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో పని చేస్తుండగా హఠాత్తుగా వారిపై పిడుగు పడింది.
దీంతో భారతమ్మ, మణెమ్మ, శాంతమ్మ అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తివివరాలు తెలియాల్సిఉంది.