సబ్‌స్టేషన్‌పై పిడుగు: పేలిన ట్రాన్స్ ఫార్మర్లు
Published Thu, Jun 8 2017 12:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
సిద్దిపేట: సిద్ధిపేట జిల్లాలోని ముస్తాబాద్ చౌరస్తా సమీపంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున పిడుగుపడింది. ఈ ప్రమాదంలో సబ్‌స్టేషన్‌లోని మూడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలి బూడిదయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంబింపచేసింది.
Advertisement
Advertisement