పిడుగు పడటంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్‌కుంద మండలం బండ రెంజల్ గ్రామంలో గురువారం తె ల్లవారుజామున చోటుచేసుకుంది.
నిజామాబాద్: పిడుగు పడటంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిచ్‌కుంద మండలం బండ రెంజల్ గ్రామంలో గురువారం తె ల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయిరాం(45) అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో వర్షం రావడంతో చెట్టు కిందకు పరిగెత్తాడు.
అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో సాయిరాం అక్కడికక్కడే మృతిచెందాడు.