ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు.
నెల్లూరు క్రైం: ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... సాదు హరి అనే వ్యక్తిని మాలకొండారెడ్డి దారుణంగా పొడిచాడు. తీవ్రగాయాలపాలైన హరిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. బాధితుడు అపస్మాకర స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.