సీనియర్ జర్నలిస్ట్ కాశీపతి గురువారం హైదరాబాద్‌లో మృతి చెందారు.
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కాశీపతి గురువారం హైదరాబాద్‌లో మృతి చెందారు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాశీపతి మృతి పట్ల వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. గొప్ప రచయిత, విలువలతో కూడిన పాత్రికేయుడు కాశీపతి అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
పత్రికాలోకానికి తీరనిలోటు: రఘువీరారెడ్డి
వై.కాశీపతి మృతికి ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి సంతాపం తెలిపారు. కాశీపతి రచించిన పుస్తకాలు ప్రజలను అలోచింపజేశావి అన్నారు. మధ్యతరగతి, మందు భారతం వంటి పుస్తకాలు సామన్య ప్రజల జీవన శైలిని అద్దం పట్టేవి అని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి గుర్తుచేసుకున్నారు. సాహిత్య చర్చలకు కాశీపతి అధిక ప్రాధ్యనత ఇచ్చేవారని అన్నారు. అభ్యదయ భావాలు కల్గిన, ఉన్నత ఆశయాలు కల్గిన వ్యక్తి కాశీపతి అని రఘువీరా కొనియాడారు. కాశీపతి మరణం ప్రతికలోకానికి తీరాని లోటు అన్నారు.