Nand Kumar Singh Chauhan Passes Away Due To COVID | మోదీ సంతాపం - Sakshi
Sakshi News home page

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి : మోదీ సంతాపం

Published Tue, Mar 2 2021 11:08 AM | Last Updated on Tue, Mar 2 2021 2:16 PM

 PM saddenedby BJP MP Nand Kumar Singh Chauhan death - Sakshi

మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ కరోనాతో కన్నుమూశారు. 

సాక్షి, భోపాల్‌: కరోనా మహమ్మారి బారిన పడి మరో బీజేపీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ లోక్‌సభ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్టీకి ఆయన లేని లోటు తీరనిది అంటూ ట్వీట్‌ చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. అటు నందకుమార్ మృతిపై బీజేపీ శ్రేణులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ,  తమనేత అకాలమరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  కాగా 2009-14మధ్య ఐదేళ్ల  కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.

చదవండి : ఎన్నికల వేడి: బీజేపీలో చేరిన సినీ నటి

 హత్రాస్‌లో మరో దారుణం : బాధితురాలి తండ్రి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement