చీపురపల్లి స్టీఫెన్ (4/57) రాణించడంతో బరోడా జట్టు భారీస్కోరు చేయకుండా ఆంధ్ర నిలువరించింది. గురువారం
సాక్షి, విజయనగరం: చీపురపల్లి స్టీఫెన్ (4/57) రాణించడంతో బరోడా జట్టు భారీస్కోరు చేయకుండా ఆంధ్ర నిలువరించింది. గురువారం మొదలైన రంజీ గ్రూప్ బి మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేసింది. కేదార్ దేవధర్ (168 బంతుల్లో 97; 14 ఫోర్లు) కొద్దిలో సెంచరీ కోల్పోగా... హుడా (0), యూసుఫ్ పఠాన్ (6), హార్ధిక్ పాండ్యా (1) విఫలమయ్యారు. స్వప్నిల్ సింగ్ (45 బ్యాటింగ్), పినాల్ షా (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. విజయ్ కుమార్, శివ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
తన్మయ్, విహారి సెంచరీలు
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్‌తో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్-సి మ్యాచ్‌లో హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. తన్మయ్ అగర్వాల్ (270 బంతుల్లో 104 బ్యాటింగ్; 8 ఫోర్లు), విహారి (216 బంతుల్లో 101; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగులు చేసింది. తన్మయ్‌తో పాటు మిలింద్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే అక్షత్ రెడ్డి (20), సుమన్ (9) వికెట్లను కోల్పోయింది. అయితే తన్మయ్, విహారిలు మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివరకు 88వ ఓవర్‌లో రోనిత్ మోరె.. విహారిని అవుట్ చేసి ఈ జోడిని విడదీశాడు. మోరెకు 2 వికెట్లు దక్కాయి.