Ranji Trophy 2022 AP vs RAJ: Andhra Pacer Stephen Takes 5 Wickets - Sakshi
Sakshi News home page

Ranji Trophy 2022: చెలరేగిన ఆంధ్ర బౌలర్‌ స్టీఫెన్‌.. 5 వికెట్లు పడగొట్టి..

Published Fri, Feb 18 2022 8:54 AM | Last Updated on Fri, Feb 18 2022 10:42 AM

Ranji Trophy Andhra Vs Rajasthan: Andhra Pacer Stephen Takes 5 Wickets - Sakshi

తిరువనంతపురం: ఆంధ్ర జట్టు లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ చీపురపల్లి స్టీఫెన్‌ (5/51) ఐదు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ఆంధ్ర జట్టుతో గురువారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘ఇ’ లీగ్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 59.2 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. రాజస్తాన్‌ జట్టులో రాజేశ్‌ బిష్ణోయ్‌ (54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు.

అనంతరం ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు సాధించింది. జ్ఞానేశ్వర్‌ (1), కరణ్‌ షిండే (23; 3 ఫోర్లు) అవుటయ్యారు. గిరినాథ్‌ (36 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), మనీశ్‌ (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.   

రహానే అజేయ సెంచరీ 
అహ్మదాబాద్‌లో సౌరాష్ట్రతో మొదలైన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. భారత క్రికెటర్‌ అజింక్య రహానే (108 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. సర్ఫరాజ్‌ (121 బ్యాటింగ్‌; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రహానే నాలుగో వికెట్‌కు 219 పరుగులు జోడించాడు.  

చదవండి: Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్‌ 270/7  
Ranji Trophy 2022: మ‌నీశ్ పాండే విధ్వంసం.. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో వీర‌విహారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement