అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ముగిసింది. వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో జరిగిన ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమోదైంది.
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కర్నూలు, నంద్యాల, ఆదోనిలలో పోలింగ్ జరిగింది. ఆదోనిలో 391 ఓట్లకు గాను 389, నంద్యాలలో 307 ఓట్లకు గాను 304, కర్నూలులో 386 ఓట్లకు గాను 384 ఓట్లు పోలయ్యాయి.
వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగులో 304 ఓట్లకు గాను 304 ఓట్లూ పోలయ్యాయి. రాజంపేట డివిజన్‌లో 228 ఓట్లు ఉండగా వంద శాతం పోలింగ్ జరిగింది. కడపలో 308 ఓట్లకు గాను 307 ఓట్లు పోలయ్యాయి.
నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో 140 ఓట్లకు గాను 140, నాయుడుపేటలో 111 ఓట్లకు గాను 111, గూడురులో 182 ఓట్లకు గాను 182, నెల్లూరులో 261 ఓట్లకు గాను 260, కావలిలో 158 ఓట్లకు గాను 158 పోలయ్యాయి.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఓటింగ్
Published Fri, Mar 17 2017 5:22 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
Advertisement
Advertisement