ఉపాధిలో అంతులేని అవినీతి | Employment in the endless corruption | Sakshi
Sakshi News home page

ఉపాధిలో అంతులేని అవినీతి

Published Mon, Mar 13 2017 11:26 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

ఉపాధిలో అంతులేని అవినీతి - Sakshi

ఉపాధిలో అంతులేని అవినీతి

రూ.2 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్టు తనిఖీల్లో గుర్తింపు

దుత్తలూరు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవినీతికి అంతులేదు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని రాజకీయ నేతలు, అధికారులు, సిబ్బంది బొక్కేశారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేసి బినామీ మస్టర్లు వేసి కూలీల సొమ్ములను స్వాహా చేశారు.

ఉదయగిరి: జిల్లాలో ఏ మండలంలో జరగని విధంగా దుత్తలూరు మండలంలో రూ.11కోట్లకు పైగా పనులు ఏడాది కాలంలో చేశారు.
ఈ పథకం ప్రారంభించిన 2007 నుంచి ఈ ఆడిట్‌ను  మినహాయిస్తే ఎప్పుడూ రూ.5 కోట్లకు మించి పనులు జరగలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అవినీతి బాగోతాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ అంశాలన్నింటినీ బలపరుస్తూ పదిరోజుల నుంచి జరిగిన సామాజిక క్షేత్ర స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవినీతి అక్షరాలా రూ.2కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే వాస్తవంగా ఈ అవినీతి అక్రమాలు రూ.3 కోట్లకు పైగానే ఉంటాయని అంచనా. ఈ అవినీతికి మూలకారుకులైన ఉపాధి సిబ్బంది, అధికారులను రక్షించే బాధ్యతను కొంతమంది అధికార పార్టీ నేతలు తీసుకోవడంతో అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు ఉంటాయో బహిరంగ చర్చావేదిక పూర్తి అయ్యేంత వరకు వేచి చూడాలి.

కనిపించని అభివృద్ధి
మండలంలో 2016 జనవరి నుంచి డిసెంబరు వరకు కేవలం కూలీల పేరుతో జరిగిన ఖర్చు రూ.7.83 కోట్లుకాగా, సామగ్రి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.3.71కోట్లు. మొత్తంగా ఏడాది కాలంలో ఈ పథకంలో ఖర్చు చేసిన నిధులు రూ.11.53 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా గ్రామాల్లో అభివృద్ధి నామామాత్రమే. కూలీల చేత చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించి, బినామీ మస్టర్లు ద్వారా నేతలు స్వాహా చేశారు. కొన్ని గ్రామాల్లో అధికార అండదండలతో కూలీలను బెదిరించి వారి పేర్లతో మస్టర్లు వేసి అరకొరగా ఇచ్చి వారిచేతనే పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా నగదు డ్రా చేసి దిగమింగారు. దీంతో నిధులు అయితే మంచినీళ్లు మాదిరే ఖర్చు అయినా అభివృద్ధి కనిపించలేదు.

పనులు చేయకుండానే నిధులు స్వాహా
ఈ పథకంలో ఇంతవరకు జరిగిన క్షేత్ర స్థాయి తని ఖీల్లో పనుల కొలతల్లో తేడాలు, నాసిరకంగా పనులు, యంత్రాలతో పనులు చేయడంలాంటి అంశాలు మా త్రమే గుర్తించారు. వీటిపై రికవరీ పెట్టారు. కానీ ఈ మండలంలో పనులు చేయకుండానే నిధులు కాజేశారు. ముఖ్యంగా పంట సంజీవని పేరుతో ఫాంపాండ్స్‌ తీయకుండానే తీసినట్లు రికార్డుల్లో నమోదు చేసి నిధులు మింగారు. కొన్ని చోట్ల పనులను యంత్రాలతో చేయించారు. పనులు మంజూరు అయిన ప్రాంతా నికి గుంటలు ఉన్న ప్రాంతానికి సంబంధమే లేదు. నిబంధలకు విరుద్ధంగా చెరువులు, వాగులు, వంకలు, ప్రభుత్వ పోరంబోకు భూముల్లో గుంటలు తీశారు. వీటి ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ అవకతవకలు భైరవరం, బ్రహ్మశ్వేరం, ఏరుకొల్లు, రాచవారిపల్లి, నందిపాడు, నర్రవాడ, బోడవారిపల్లి, బండకిందపల్లి, దుత్తలూరు పంచాయతీల్లో చోటుచేసుకున్నాయి.

సిబ్బంది చేతివాటం
ఈ అవినీతి వ్యవహారంలో సిబ్బంది పెద్ద మొత్తంలో మింగేశారు. ఓ టీఏ ఏకంగా రూ.50 లక్షలు సంపాదిం చినట్లు చర్చించుకుంటున్నారు. మెటీరియల్‌ పనుల్లో జరిగిన అక్రమాలకు ఇప్పుటికే ఈసీ, ఏపీఓ, ఒక టీఏ ను సస్పెండ్‌ చేశారు. సామగ్రి పనులకు సంబం ధించి పే ఆర్డర్‌ ఇచ్చే కీలక స్థానంలో ఉన్న ఏంపీడీఓకు పాత్ర ఉన్నా అ«ధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా జిల్లా అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ ఎంపీడీఓ అవినీతి గురించి ప్రశ్నించే వారిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయ డం విశేషం. పాపంపల్లిలో నాబార్డు ద్వారా జరిగిన కుంటలను మళ్లీ చూపి ఉపాధి నిధులు స్వాహా చేసిన ట్లు ఆడిట్‌ బృందాలు గుర్తించాయి. రాచవారిపల్లెలో ఓ చెక్‌డ్యామ్‌కు పునాదులు లేకుండానే పైపైనే పనులు చేసి నిధులు దిగమింగినట్లు తనిఖీల్లో గుర్తించారు. దు త్తలూరులో సుమారు 30, భైరవరంలో 10, నందిపాడులో 9,పాపంపల్లిలో 4, బ్రహ్మేశ్వరంలో 15 గుంటలు తీయకుండానే నిధులు స్వాహా చేసినట్లు ఆడిట్‌ అధికారులు గుర్తించిట్లు విశ్వసనీయ సమాచారం.

నేడు బహిరంగ చర్చావేదిక
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సామాజిక తనిఖీ బృందాలు గ్రామసభలు జరపలేదు. పైగా మండల కేంద్రంలో నిర్వహించాల్సిన బహిరంగ చర్చావేదికను జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తారు. ఈ వేదిక సాక్షిగా అడిట్‌ బృందం బయటపెట్టే అవినీతిని కప్పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వేదికకు డ్వామా పీడీ హరిత వస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఉపాధి అధికారులు ఆమెను రాకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి  ఈ అవినీతిలో భాగస్వాములున్నవారిపై చర్యలు ఉంటా యా! లేక తేలిపోతాయా! తేలాలంటే సోమవారం సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement