పారదర్శకంగా ఉపాధి పనులు వలసలను నివారిస్తాం
అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు
అర్హులైన వారికే పింఛన్లు
గంగాధర నెల్లూరు: ఉపాధిహామీ పనుల్లో అవినీతిని అరికట్టేందుకే సామాజిక తనిఖీ చేపడుతున్నారని ఎంపీపీ ప్రగతి తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మం గళవారం ఎంపీపీ అధ్యక్షతన సామాజిక తనిఖీపై బహిరంగ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ మండలంలో ఉపాధి హామీ పనులు పారదర్శకంగా ఉండాలన్నారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కల్పించాలన్నారు. వలసలను నివారించడం, పేదలకు పనులు కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎంపీడీఓ షైలా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 2000 పనులకు రూ. 3.24 కోట్లు ఖర్చు పెట్టినట్లు వివరించారు. దీనిపై సామాజిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. అవకతవకలను నిరోధించడానికి కృషి చేస్తున్నామన్నారు.
అదనపు ఏపీడీ శంకరయ్య మాట్లాడుతూ మండలంలోని పలు పంచాయతీల్లో 19 మంది మృతి చెందారని, వా రి కుటుంబానికి రావల్సిన పింఛన్లు కొందరు స్వాహా చేసిన విషయం బయటపడిందన్నారు. దీనికి సంబంధించి రూ. 71,500 రికవరీ చేయాల్సి ఉందన్నారు. అ ర్హత లేని వారికి ిపింఛన్లు ఇచ్చారని, దీనిని తొలగించాలని ఎంపీడీఓ షైలాను ఆదేశించారు. అవినీతికి పా ల్పడే వారిని సహించేది లేదన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎపీఓ రవికుమార్, ఏపీఎంలు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, చిరంజీవి, ఏపీఓ మార్గరెట్ తదితరులు పాల్గొన్నారు.