బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయడం అనైతికమని ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి అన్నారు.
కడప: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం అనైతికమని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి అన్నారు. టీడీపీకి బలం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టారని విమర్శించారు.
టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు చెప్పారు. ఈసీపై తమకు నమ్మకముందని, శుక్రవారం జరిగే ఎన్నికలో తమదే విజయమని అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.