పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తా | - | Sakshi
Sakshi News home page

పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తా

Published Sun, Jun 25 2023 9:24 AM | Last Updated on Sun, Jun 25 2023 10:44 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జగదీష్‌ శెట్టర్‌ - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జగదీష్‌ శెట్టర్‌

కర్ణాటక: తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది, స్పీకర్‌ను చేయడం పార్టీ ఇష్టం అని ఎమ్మెల్సీ జగదీశ్‌ శెట్టర్‌ అన్నారు. తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికై న తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలతో మాట్లాడానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించమన్నా తాను సమయాన్ని కేటాయిస్తానన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. ఉత్తర కర్ణాటకలో 11 ఎంపీ స్థానాలు ఉండగా వీటిలో 6, 7 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ఈ ప్రాంత సమస్యలపై పరిషత్‌లో చర్చిస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్నో అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసేలా సంబంధిత మంత్రులతో చర్చిస్తానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement