లక్నో: కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడల్లా విపక్షాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎద్దేవాచేశారు. ఈడీ అంటే ఎగ్జామినేషన్ ఇన్ డెమాక్రసీ అని కొత్త భాష్యం చెప్పారు. ‘విపక్షాలు తప్పకుండా ఈడీ పరీక్ష పాస్ అవ్వాల్సిందే. పరీక్షకు విపక్షాలు సిద్ధమైతే మౌఖిక పరీక్ష అయినా, రాత పరీక్ష అయినా భయముండదు’ అని అన్నారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అఖిలేశ్ పైవిధంగా ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment