లక్నో: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదంపై సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ప్రజలకు గుండె సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సైంటిస్టులు తేల్చితే దీనికి బాధ్యులెవరని అఖిలేశ్ ప్రశ్నించారు. సామాన్య ప్రజల జీవితాలను కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని మండిపడ్డారు.
ఈ విషయమై బుధవారం(మే1) అఖిలేశ్ ఇటావాలో మాట్లాడారు. వ్యాక్సిన్‌ల విషయంలో బీజేపీ పెద్ద నేరం చేసిందన్నారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం కంటే పెద్ద నేరమన్నారు. ‘‘ఏక్ మే ఔర్ బీజేపీ గయ్’’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా కొవిషీల్డ్ వివాదంపై స్పందించారు. ఒకపక్క కొవిషీల్డ్‌తో ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కేంద్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పడమేంటన్నారు. యువత గుండె జబ్బులతో కుప్పకూలడానికి వ్యాక్సిన్‌కు లింక్ ఉందన్న ప్రచారం జరుగుతోందని చెప్పారు.
కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాట వాస్తవమేనని వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకా ఒప్పుకోవడంతో వివాదం రేగింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 90 శాతం మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్‌నే తీసుకోడం గమనార్హం.
— ANI (@ANI) May 1, 2024
Comments
Please login to add a commentAdd a comment