ఆ పార్టీ తరపున యూపీ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ.. | Mamata Banerjee To Campaign For Akhilesh Yadavs Party In UP | Sakshi
Sakshi News home page

ఆ పార్టీ తరపున యూపీ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ..

Published Wed, Jan 19 2022 8:37 AM | Last Updated on Wed, Jan 19 2022 8:37 AM

Mamata Banerjee To Campaign For Akhilesh Yadavs Party In UP - Sakshi

కోల్‌కతా: ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ పోటీ చేయదని, కేవలం ఎస్‌పీకి మద్దతుగా ప్రచారం చేస్తామని టీఎంసీ నేత కిరణ్మయ్‌ నందా మంగళవారం చెప్పారు. బీజేపీపై యుద్ధానికి సమాజ్‌వాదీకి మద్దతిస్తామన్నారు.

ఇందులో భాగంగా లక్నో, వారణాసిల్లో అఖిలేశ్‌తో కలిసి మమత ఆన్‌లైన్‌ ప్రచారం చేస్తారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేక శక్తుల్లో మమత కీలకమని చెప్పారు. ఆమె ఎంత బలమైన నేత అని అందరికీ తెలుసని, 2021 బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి గుణపాఠం చెప్పారన్నారు. మరోవైపు బెంగాల్లో టీఎంసీ విజయం తరవాత జరిగిన హింసపై సమాజ్‌వాదీ అభిప్రాయం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.  

చదవండి: (వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు పెట్టుకోం: ఆజాద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement