
సాక్షి, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్ యాదవ్‌కు మంత్రి కేటీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన అఖిలేశ్.. అక్కడ సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.
జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్యాయ రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మమతా బెనర్జీ, దేవేగౌడ, కరుణానిధి, స్టాలిన్ వంటి నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఈ ప్రక్రియలో భాగంగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కలిసి పనిచేసే విషయమై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment