ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మే 17 వరకు లక్నోలో 144 సెక్షన్ విధించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, హోలీ, రంజాన్‌తో సహా ముఖ్యమైన, మతపరమైన పండుగల దృష్ట్యా లక్నో నగరంలో 144 సెక్షన్ విధించినట్లు లా అండ్ ఆర్డర్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఉపేంద్ర కుమార్ అగర్వాల్ తెలియజేశారు.
లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి ఐదో దశలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంమీద లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.
పోలీసుల నిషేదాజ్ఞల ప్రకారం.. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటానికి వీల్లేదు. పాదయాత్రలు నిర్వహించడం, బాణాసంచా కాల్చడంపై నిషేధం. అలాగే లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ బ్యాండ్‌ల వినియోంగంపై నిషేధం ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా సామాజిక కార్యక్రమాలు,
నిరసనలు లేదా నిరాహార దీక్షలు చేపట్టడానికి అనుమతి లేదు.
ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రాపై బీజేపీ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. రాజ్‌నాథ్ 2014, 2019 ఎన్నికల్లో లక్నో స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1991 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment