దేశంలోని తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అభివృద్ధి చెందనుంది. లక్నోలోని నాదర్‌గంజ్ ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ అభివృద్ధి ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ అందింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.
యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీసీఎల్) ఏఐ సిటీ ప్రణాళిక అమలు ప్రక్రియను ప్రారంభించింది. యూపీసీఎల్.. నగర రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ కోసం ‘యూపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ (యూపీఈఎంపీ)’ కింద ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీలు, ఏజెన్సీల నుండి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కారణంగా ఐటీ కంపెనీలకు గ్రేడ్-ఏ సర్టిఫైడ్ కమర్షియల్ స్పేస్, అత్యాధునిక డేటా సెంటర్లు, గ్రేడ్-ఏ ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్, టెక్ ల్యాబ్‌ల నిర్మాణానికి మార్గం సుగమం కానుంది.
అలాగే ఈ సిటీలో నివాస సముదాయాలు, వినోద ప్రదేశాలు, వాణిజ్య స్థలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఐటి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్.. లక్నోలో అవసరమైన భూములను గుర్తించింది. ఇవి నాదర్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియాకు సమీపంలో ఉన్నాయి. ఈ ప్రాంతం లక్నో అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్నో-కాన్పూర్ హైవేకి సమీపంలో ఈ ప్రాంతం ఉంది.
ఇది కూడా చదవండి: అమెరికాలోనూ.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు!
Comments
Please login to add a commentAdd a comment