
లక్నోలో ఫైట్స్ చేస్తున్నాడు మిస్టర్ బచ్చన్ . హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్ ’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ లక్నోలోప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ జరుగుతోంది. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్‌ల సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment