మరో ‘వందే భారత్‌’ ట్రయల్‌ రన్‌ విజయవంతం | Trial of Patna-Lucknow Vande Bharat Express | Sakshi
Sakshi News home page

Vande Bharat Express: మరో ‘వందే భారత్‌’ ట్రయల్‌ రన్‌ విజయవంతం

Published Sat, Mar 9 2024 1:25 PM | Last Updated on Sat, Mar 9 2024 1:32 PM

Trial of Patna Lucknow Vande Bharat Express - Sakshi

ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్  ఎక్కాల్సి ఉంటుంది. 

ఈ వందే భారత్‌ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్‌లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్‌ను ఇంకా విడుదల చేయలేదు. 

పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్‌లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్‌లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement