రోహిత్ శర్మ
ICC ODI WC 2023- Rohit Sharma Injured?: వన్డే వరల్డ్‌కప్-2023లో డబుల్ హ్యాట్రిక్ విజయంపై విజయంపై కన్నేసిన టీమిండియాకు ఎదురుదెబ్బ! కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. దీంతో అతడు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా ఐసీసీ టోర్నీలో ఇప్పటికే ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించిన టీమిండియా సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే క్రమంలో ఆదివారం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. లక్నోలోని ఏక్నా స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి.
కెప్టెన్‌గా రోహిత్‌కు వందో మ్యాచ్
ఇక విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా సారథిగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది వందవ మ్యాచ్. అయితే, ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ దూరమయ్యే పరిస్థితి వచ్చిందంటూ ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మణికట్టుకు గాయం!
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు లక్నోలో శనివారం ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా రోహిత్ మణికట్టుకు స్వల్ప గాయమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతినిచ్చే యోచనలో వార్తలు వినిపిస్తున్నాయి. మున్ముందు కీలక మ్యాచ్‌లు ఉన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బరిలోకి దిగుతాడు!
ఈ క్రమంలో.. ఇప్పటికే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో దూరమైన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్ ఉంది. అదే విధంగా రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ శుబ్‌మన్ గిల్‌కు జోడీగా ఓపెనింగ్‌కు వస్తాడు.
అయితే, గాయం చిన్నదే కావడంతో రోహిత్ శర్మ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా రోహిత్ గాయం గురించి బీసీసీఐ నుంచి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది.
చదవండి: హార్దిక్ వచ్చేంత వరకు అతడే.. ఇంగ్లండ్ డేంజరస్ టీమ్! కాబట్టి మేము..
Comments
Please login to add a commentAdd a comment