
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). Photo Courtesy: BCCI/IPL

ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. Photo Courtesy: BCCI/IPL

ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.

అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్‌లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. Photo Courtesy: BCCI/IPL

ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం పంత్‌కు ఊరట దక్కింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు.

అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.

ఇదిలా ఉంటే.. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ. 27 కోట్లు.. కనీసం 27 పరుగులైనా చేయవా? అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

మరోవైపు.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఓటముల తర్వాత పంత్‌కి క్లాస్ తీసుకున్నట్లుగా ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి

Photo Courtesy: BCCI/IPL