పుణే జట్టు పేరు సూపర్ జెయింట్స్
కెప్టెన్గా ధోని పేరు ప్రకటన
కోల్కతా: ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ పుణే జట్టు తమ పేరును ప్రకటించింది. వచ్చే రెండు సీజన్ల పాటు ఈ జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (ఆర్పీఎస్జీ) పేరుతో బరిలోకి దిగుతుంది. అలాగే తమ జట్టుకు కెప్టెన్ ధోని అని అధికారికంగా ప్రకటించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ జట్టు పేరు, లోగో ఆవిష్కరించారు. సంజీవ్ గోయెంకాకు చెందిన ఈ జట్టుకు వారి గ్రూప్ పేరు ఆర్పీజీ వచ్చేలా పేరు పెట్టినట్లు కనిపిస్తోంది. అలాగే గతంలో రాజస్తాన్ జట్టుతో కలిసి పని చేసిన రఘు అయ్యర్ ఇకపై గోయెంకా గ్రూప్ స్పోర్ట్స్ విభాగానికి సీఈఓగా పని చేస్తారు.