లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరాన్ని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం..అడ్వకేట్ కమీషనర్ నేతృత్వంలోని సర్వే బృందం సర్వే చేసేందుకు ప్రార్థనా మందిరంలోకి అడుగుపెట్టింది. అయితే, ఆ సర్వేను అడ్డుకునేందుకు వెయ్యికి మందికి పైగా స్థానికులు ప్రయత్నించారు. పోలీసుల్ని ప్రార్థనా మందిరంలోకి వెళ్లకుండా వాగ్వాదానికి దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. అధికారుల వాహనాలకు నిప్పంటించారు.
అయితే, స్థానికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు మరణించారు. 30మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి’ అని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం, పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment