అల్లోపతి వైద్యులకూ ప్రత్యేక లోగో | Special logo for allopathic doctors | Sakshi
Sakshi News home page

అల్లోపతి వైద్యులకూ ప్రత్యేక లోగో

Published Sun, Jul 30 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

అల్లోపతి వైద్యులకూ ప్రత్యేక లోగో

అల్లోపతి వైద్యులకూ ప్రత్యేక లోగో

చండీగఢ్‌: అల్లోపతి డాక్టర్ల వినియోగం కోసం భారత వైద్య  మండలి ఓ లోగోకు పేటెంట్‌ సంపాదిం చింది. కొత్త లోగోలో.. ఎర్రని ప్లస్‌ గుర్తులో కూపర్‌ ఫాంట్‌లో ఇంగ్లిష్‌ అక్షరాలు డీఆర్‌ రాసి ఉన్నాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల తో పోల్చితే అల్లోపతి వైద్యులను ప్రత్యేకంగా గుర్తించేందుకే ఈ లోగోను తీసుకొచ్చామని చండీగఢ్‌ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్‌ రమనీక్‌ సింగ్‌ బేడీ చెప్పారు.  ఈ గుర్తు సాయంతో రోగులు సులభంగా నిష్ణాతులైన వైద్యులను గుర్తించవచ్చని సింగ్‌ తెలిపారు. కేంద్రప్రభుత్వ ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రీ ఈ లోగోను ఐఎంఏ  మేధోసంపత్తి హక్కుగా నమోదుచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement