
ఆర్‌ఎంఎస్ పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి కల్చరల్: తిరుపతి నగరంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్న అఖిల భారత ఆర్‌ఎంఎస్, ఎంఎంఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభల పోస్టర్లు, లోగోను గురువారం ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే స్వగృహంలో యూనియన్ నాయకులు ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగభూషణం మాట్లాడుతూ యూనియన్ స్థాపించి 60 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంపీలు వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి హాజరవుతారని పేర్కొన్నారు. అఖిల భారత ఆర్‌ఎంఎస్, ఎంఎంఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శ్రీధర్‌బాబు, కన్నయ్య, ఆర్ముగం, చంద్రశేఖర్, కొండయ్య, మోహన్‌కుమార్ పాల్గొన్నారు.