
2018లో లండన్‌లో జరగబోయే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు సంబంధించి కొత్తగా విడుదల చేసిన లోగోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చదరంగానికి ఇంత అసభ్యతను జోడించడం ఏమిటంటూ ప్రపంచవ్యాప్తంగా గారీ కాస్పరోవ్‌వంటి దిగ్గజాలు సహా పలువురు విరుచుకు పడ్డారు. నవంబర్ 18నుంచి మాగ్నస్ కార్ల్‌సన్...క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచే చాలెంజర్‌తో తలపడతాడు.
‘చెస్‌ను ప్రపంచంలో ఎవరైనా గేమ్‌ల కోసమే చూస్తారు. దీనిని అర్ధరాత్రి మాత్రమే చూడగలిగే టీవీ షోగా మార్చకండి. నాకు తెలిసిన చెస్‌లో 8గీ8 గళ్లు ఉంటాయి. ఇక్కడ 6గీ6 కనిపిస్తున్నాయి’ అని దీనిపై విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. అయితే నిర్వాహకులు మాత్రం ఈ లోగోతోనే ప్రచారానికి సిద్ధమైనట్లు ప్రకటించేశారు.