
సాక్షి, ఒంగోలు టౌన్: ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీకి సంబంధించిన లోగోను ఆసక్తి కలిగిన కళాకారులు పంపించాలని యూనివర్శిటీకి చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ) జీ. సోమశేఖర ఒక ప్రకటనలో కోరారు. లోగోకు సంబంధించి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఆశయాలకు అనుగుణంగా ఆయా కళాకారులు, మేధావుల నుంచి వారి ఆలోచనల మేర లోగో తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వవిద్యాలయ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా లోగో ఉండాలన్నారు. ఎంపికైన లోగోను తయారుచేసిన కళాకారులను విశ్వవిద్యాలయ అధికారులు సత్కరించడం జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగినవారు యూనివర్సిటీకి సంబంధించిన లోగోను ఈనెల 30వ తేదీలోపు soanuongoe@gmai.com మెయిల్‌కు పంపించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment