టీమిండియా జెర్సీపై ఇంకా ఆ లోగో ఏమిటి? | Why Does Team India Still Use British-era Logo? | Sakshi
Sakshi News home page

టీమిండియా జెర్సీపై ఇంకా ఆ లోగో ఏమిటి?

Published Mon, Jun 19 2017 5:03 PM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

టీమిండియా జెర్సీపై ఇంకా ఆ లోగో ఏమిటి?

టీమిండియా జెర్సీపై ఇంకా ఆ లోగో ఏమిటి?

బ్రిటీష్ కాలంనాటి స్టార్ ఆఫ్ ఇండియాను పోలివుండే చిహ్నాన్ని భారత క్రికెట్ జట్టు ఇంకా తమ జెర్సీలపై ధరించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ప్రశ్నించింది.

న్యూఢిల్లీ:బ్రిటీష్ కాలంనాటి స్టార్ ఆఫ్ ఇండియాను పోలివుండే చిహ్నాన్ని భారత క్రికెట్ జట్టు ఇంకా తమ జెర్సీలపై ధరించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ప్రశ్నించింది. యూనియన్ ఆఫ్ ఇండియా సింబల్ బదులు బ్రిటీష్ కాలం నాటి ఆ లోగోను పోలిన జెర్సీని ఉపయోగించడాన్ని తప్పుబట్టింది. 1928లో బ్రిటీష్ పరిపాలనలో ఆ తరహా లోగో తయారు చేయబడిన విషయాన్ని సీఐసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

 

ఇంకా ఆనాటి స్టార్ ఆఫ్ ఇండియా లోగోను ఎందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఉపయోగిస్తుందని ప్రశ్నించింది. దేశంలో బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలు ఆర్టీఐ పరిధిలోకి వచ్చే విషయాన్ని సీఐసీ మరోసారి స్పష్టం చేసింది. ఇక్కడ బీసీసీఐని ఆర్టీఐ చట్ట పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ మేరకు నెలరోజుల్లో సమాధానం ఇవ్వాలని సీఐసీ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement