పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కులోగో డిజైన్ పోటీ
న్యూఢిల్లీ: డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ కొత్తగా ఏర్పాటు చేయనున్న పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్ కోసం మైగౌవ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక పబ్లిక్ కంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి రూ. 50,000 ప్రైజ్ మనీని అందిస్తోంది. పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఔత్సాహికులకు ఈ కంటెస్ట్ జూలై 9 వరకు అందుబాటులో ఉంటుందని పోస్టల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమౌతాయని అం చనా. ప్రముఖ డిజైనర్లు, నిపుణులతో కూడిన ఒక కమిటీ వచ్చిన ఎంట్రీస్‌లో 20 ఉత్తమ డిజైన్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. విజేత కోసం వీటిని తర్వాత మైగౌవ్ ప్లాట్‌ఫామ్‌లో ఓటింగ్‌కు పెడతారు. దేనికైతే అధిక ఓట్లు వస్తాయో.. దాన్ని రూపొందించిన వారిని విన్నర్‌గా ప్రకటించి.. వారికి ప్రైజ్ మనీని అందజేస్తారు.