వివాదాస్పద లోగో రద్దు
జపాన్ ఒలింపిక్ లోగో వివాదాల్లోచిక్కుకుంది. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రముఖ డిజైనర్ కెన్జిరో సోనో రూపొందించిన లోగో వివాదాస్పదమైంది. దీంతో టోక్యో ఒలింపిక్ కమిటీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లోగోను వాడద్దంటూ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ జపాన్ నేషనల్ మీడియా ఈ విషయాలను దృవీకరించింది.
జూన్ లో లాంఛ్ చేసిన ఈ డిజైన్.. తన ధియేటర్ కంపెనీ లోగోను కాపీకొట్టి రూపొందించారని బెల్జియన్ డిజైనర్ ఒలివర్ డెబి ఆరోపించాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ముందుకు తీసుకెళ్లాడు.
టోక్యో లోగో టీ ఫర్ టోక్యో, టుమారో, టీమ్ అని తెలిపేలా రూపొందించారు. వీటిపైన హార్ట్ బీట్ కు గుర్తుగా ఎర్ర బిందువు ఏర్పాటు చేశారు. మరో వైపు నలుపు బ్యాగ్రౌండ్ పైన తెలుపు అక్షరాలతో రూపొందించిన బెల్జియన్ ధియేటర్ లోగో దాదాపు ఇలాంటి ఆకారంలోనే ఉంది. ఐఓసీ అధికారులు మాత్రం దీనిపై పెదవి విప్పటం లేదు.