వాట్సాప్‌లో ఈ రహస్య ఫీచర్‌ తెలుసా? | Even Without Blue Tick You Can Know If Your Message is Read Or Not In Whatsapp | Sakshi

వాట్సాప్‌లో ఈ రహస్య ఫీచర్‌ తెలుసా?

Feb 23 2020 2:34 PM | Updated on Feb 23 2020 3:17 PM

Even Without Blue Tick You Can Know If Your Message is Read Or Not In Whatsapp - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్‌లో మనం పోస్ట్‌ చేసిన మెసేజ్‌ ఎవరైనా చదివారా లేదా అని తెలుసుకోవటానికి ఏం చేస్తాం. మెసేజ్‌ దగ్గర బ్లూటిక్స్‌ ఉన్నాయా లేదో చెక్‌ చేసుకుంటాం. మన మెసేజ్‌కు అవతలి వారు రెస్పాండ్‌ అవుతారా లేదా అన్నది పక్కనపెడితే వాళ్లు మన మెసేజ్‌ చదివారన్నది మాత్రం తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్‌ చదివారో లేదో తెలుసుకోవటం కష్టం. అసలు బ్లూటిక్స్‌ గురించి చెప్పాలంటే.. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ 2014లో వాడుకలోకి తెచ్చింది. బ్లూటిక్స్‌ పడ్డాయంటే ఎదుటివ్యక్తి మన మెసేజ్‌ చదివాడని అర్థం. ఆ తర్వాత వాట్సాప్‌ వన్‌టిక్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తిని మన మెసేజ్‌ చేరగానే వన్‌టిక్‌ పడుతుంది. అయితే దాన్ని తర్వాత గ్రే కలర్‌లోకి మార్చేసింది.

బ్లూటిక్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసిన వ్యక్తి మీ మెసేజ్‌ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్‌ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్‌ మెసేజ్‌ చేయండి.  ఆ వ్యక్తి మీ వాయిస్‌ రికార్డింగ్‌ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్‌ పడిపోతాయి. అతడు బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినప్పటికి వాయిస్‌ మెసేజ్‌ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్‌ పడిపోతాయి. ఇది ఒకరకంగా వాట్సాప్‌లోని లోపమని చెప్పొచ్చు. గత సంవత్సరమే ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement