సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం తీవ్ర విమర్శలు చేశారు. 'ఆరోగ్య సేతు' ఓ అధునాతన నిఘా వ్యవస్థ అని ఆరోపించారు. వ్యవస్థీకృత పర్యవేక్షణ లేకుండానే దీని నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు. దీనికి సంస్థాగత పర్యవేక్షణ లేకపోవడం వల్ల డేటా భద్రతకు భంగం కలగడం, వ్యక్తిగత గోప్యత సమస్యలు లాంటివి పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం అనేది మనల్ని సురక్షితంగా ఉంచాలి కానీ, అనుమతి లేకుండా మనపై నిఘా ఉంటుందన్న భయాలను మాత్రం కలిగించకూడని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (చదవండి : ఇకపై కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’!)
కాగా, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఎక్కడైనా సరే కార్యాలయాలకు హాజరయ్యే ఉద్యోగుల ఫోన్లలో ఆ యాప్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మే 4 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆయా కంపెనీలు, సంస్థలు, శాఖల ఉన్నతాధికారులు దీన్ని తప్పనిసరిగా అమలయ్యే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది.
The Arogya Setu app, is a sophisticated surveillance system, outsourced to a pvt operator, with no institutional oversight - raising serious data security & privacy concerns. Technology can help keep us safe; but fear must not be leveraged to track citizens without their consent.
— Rahul Gandhi (@RahulGandhi) May 2, 2020
Comments
Please login to add a commentAdd a comment