
ఒక్క క్లిక్‌తో భూమి లెక్కలు
‘మీభూమి’ పోర్టల్ ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: భూముల సమగ్ర వివరాలకు సంబంధించిన ‘మీభూమి’ వెబ్ పోర్టల్‌ను, ఆండ్రాయిడ్ అప్లికేషన్ (యాప్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. రెవెన్యూ శాఖ అధికారులకే పరిమితమైన ‘మీభూమి’ పోర్టల్ ఇప్పుడు ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది. మీభూమి వెబ్‌పోర్టల్‌కోసం www.meebhumi.ap.gov.in కు లాగిన్ అవ్వాలి.