అద్దంకి : ‘సాక్షి’ స్పెల్ బీ ఇండియా పోటీకి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ‘సాక్షి ’ నిర్వహిస్తున్న స్పెల్ బీ పోటీతో విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలపై పట్టు పెరిగి, సునాయాసంగా మాట్లాడడానికి వీలుకలుగుతోందని అద్దంకి డివిజన్‌లోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్, బెల్ అండ్ బెనెట్ తదితర పాఠశాలల విద్యార్థులు స్పెల్ బీ పరీక్షకు సిద్ధమవుతున్నారు.
మన మాతృభాష తెలుగు అయినప్పటికీ విద్యార్థులు ఒక్క తెలుగే నేర్చుకుంటే సరిపోదు. ప్రపంచ దేశాల ప్రజలు అధికంగా మాట్లాడే ఇంగ్లిష్ భాషపై పట్టుసాధించాలి. బాగా చదువుకుని విదేశాలకు వెళ్లాలన్నా, ఇక్కడకు వచ్చిన విదేశీయులతో మాట్లాడాలన్నా ఇంగ్లిష్ నేర్చుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేరుస్తున్నారు.
ఈ పరిస్థితులన్నీ గమనించిన ‘సాక్షి’.. విద్యార్థుల తల్లిదండ్రులకు తాము చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుని, ఎక్కువ ధర కలిగిన స్పెల్ బీ పుస్తకాన్ని అతి తక్కువ ధరకే విద్యార్థులకు అందజేస్తోంది. ఇంతటితో ఆగకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, నగదు బహుమతులను అందజేసి విద్యార్థుల్లో ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తోంది.
ఇందులో భాగంగానే ‘సాక్షి’ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీన మొదటి దశ పరీక్ష, నవంబర్ 9న రెండో దశ పరీక్ష, నవంబర్ 23న మూడో దశ పరీక్ష, డిసెంబర్ 5వ తేదీన చివరి దశ స్పెల్ బీ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి విభాగంలో ఒకటి, రెండో తరగతి, రెండో విభాగంలో మూడు, నాలుగో తరగతి, మూడో విభాగంలో ఐదు, ఆరు, ఏడో తరగతి, నాలుగో విభాగంలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్పెల్‌బీ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
‘సాక్షి’ స్పెల్ బీకి విశేష స్పందన
Published Fri, Sep 26 2014 5:20 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement