privileged response
-
‘సదరమ్’ శిబిరానికి భారీ స్పందన
చేవెళ్ల: చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంప్‌నకు విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాలకు సంబంధించి ఈ క్యాంపులో మొత్తం 581 మంది వికలాంగులు పాల్గొన్నారు. శారీరక వికలాంగుల కోసం చేవెళ్ల ఆస్పత్రిలో భవనం ఆవరణలో, కంటి చూపు లోపమున్న వారి కోసం మహిళా సమాఖ్య భవనంలో, చెవిటి, మూగవారి కోసం ఆర్అండ్బీ కార్యాలయంలో ఆవరణలో కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. వైద్యులు బాలరాజ్, సుప్రియ, బి. శేఖర్‌గౌడ్‌లు దరఖాస్తులను స్వీకరించారు. డీఆర్డీఏ ఏరియా కో ఆర్డినేటర్ పద్మావతి, జిల్లా యాంకర్ పర్సన్ శేఖర్, మూడు మండలాల ఏపీఎంలు మంజులవాణి, రవీందర్, నర్సింలు, ఐకేపీ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. శారీరక వికలత్వం కలవారు 400 మంది కాగా చూపు లోపం ఉన్న వారు 69 మంది, మూగ, చెవిటి సమస్యలు ఉన్న వారు 112 మందిగా నమోదు చేసుకున్నట్లు ఏరియా కోఆర్డినేటర్ పద్మావతి తెలిపారు. కాగా.. అంధత్వ పరీక్షల కోసం వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. ఫాంలు నింపి వాటిని వైద్యులకు చూపించేందుకు వెళ్తే తమను వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఏ సమస్యపై వచ్చారని అడగకుండానే ఫాంలు తీసుకొని పంపించారని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సర్టిఫికెట్ వస్తుందో రాదో కూడా చెప్పలేదని ఆందోళన చెందారు. దీంతో ఒకానొక దశలో వైద్యులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపునకు వచ్చిన వారిలో ఎంతమంది అర్హులు.. ఎంతమందికి సర్టిఫికెట్లు వస్తాయో కూడా తెలియకపోవటంతో వెళ్లిపోయారు. వికలాంగుల సౌకర్యం కోసమే ‘సదరమ్’ మేడ్చల్ : వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం వికలాంగులు ఆస్పత్రుల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతోనే డివిజన్ల వారీగా జిల్లాలో సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్టు డీఆర్డీఏ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ సూర్యారావు పేర్కొన్నారు. మేడ్చల్ సివిల్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం నిర్వహించిన సదరమ్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడ్చల్ లో నిర్వహించిన శిబిరానికి మేడ్చల్, కీసర, మేడ్చల్ నగరపంచాయతీల నుంచి 339 మంది హాజరయ్యారన్నారు. వీరిలో 242 మందికి వైకల్యం ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. మేడ్చల్ మండలం నుంచి 179 మంది, కీసర నుంచి 160 మంది హాజరైనట్టు చెప్పారు. అర్హులైన వికలాంగులకు రెండు రోజుల్లో ధ్రువపత్రాలు స్థానికంగానే అందజేస్తామని అన్నారు. శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు శైలజ, డీఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ సరస్వతీ, ఏపీఎం లీలాకుమారి పరిశీలించారు. -
‘సాక్షి’ స్పెల్ బీకి విశేష స్పందన
అద్దంకి : ‘సాక్షి’ స్పెల్ బీ ఇండియా పోటీకి జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. ‘సాక్షి ’ నిర్వహిస్తున్న స్పెల్ బీ పోటీతో విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలపై పట్టు పెరిగి, సునాయాసంగా మాట్లాడడానికి వీలుకలుగుతోందని అద్దంకి డివిజన్లోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్, బెల్ అండ్ బెనెట్ తదితర పాఠశాలల విద్యార్థులు స్పెల్ బీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. మన మాతృభాష తెలుగు అయినప్పటికీ విద్యార్థులు ఒక్క తెలుగే నేర్చుకుంటే సరిపోదు. ప్రపంచ దేశాల ప్రజలు అధికంగా మాట్లాడే ఇంగ్లిష్ భాషపై పట్టుసాధించాలి. బాగా చదువుకుని విదేశాలకు వెళ్లాలన్నా, ఇక్కడకు వచ్చిన విదేశీయులతో మాట్లాడాలన్నా ఇంగ్లిష్ నేర్చుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేరుస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనించిన ‘సాక్షి’.. విద్యార్థుల తల్లిదండ్రులకు తాము చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుని, ఎక్కువ ధర కలిగిన స్పెల్ బీ పుస్తకాన్ని అతి తక్కువ ధరకే విద్యార్థులకు అందజేస్తోంది. ఇంతటితో ఆగకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, నగదు బహుమతులను అందజేసి విద్యార్థుల్లో ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపనను రేకెత్తిస్తోంది. ఇందులో భాగంగానే ‘సాక్షి’ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీన మొదటి దశ పరీక్ష, నవంబర్ 9న రెండో దశ పరీక్ష, నవంబర్ 23న మూడో దశ పరీక్ష, డిసెంబర్ 5వ తేదీన చివరి దశ స్పెల్ బీ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి విభాగంలో ఒకటి, రెండో తరగతి, రెండో విభాగంలో మూడు, నాలుగో తరగతి, మూడో విభాగంలో ఐదు, ఆరు, ఏడో తరగతి, నాలుగో విభాగంలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్పెల్‌బీ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. -
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
సప్తగిరికాలనీ, న్యూస్‌లైన్ : సాక్షి, ఇండియా స్పెల్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని ఐరిస్ వరల్డ్ స్కూల్లో ఆదివారం జరిగిన స్పెల్‌బీ జోనల్ రౌండ్ పరీక్షకు విశేష స్పందన వచ్చింది. అక్షరదోషాలు లేకుండా ఆంగ్ల పదాలు రాయడం.. వాటిని ఎలా పలకాలో క్లుప్తంగా వివరించడం.. కొత్త ఆంగ్ల పదాలు విద్యార్థులకు పరిచయం చేయడానికి సాక్షి, ఇండియాస్పెల్ ఆధ్వర్యంలో స్పెల్‌బీ పరీక్షను దేశమంతటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రౌండ్లో విజేతలకు జోనల్‌స్థాయిలో పరీక్ష నిర్వహించారు. దీనికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతి, కేటగిరీ-2లో మూడు, నాలుగు, కేటగిరీ-3లో ఐదు నుంచి ఏడు, కేటగిరీ-4లో ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 211 మంది హాజరుకాగా.. ‘సాక్షి’ టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రశ్నలు వేశారు. వాటికి అక్షరదోషాలు లేకుండా విద్యార్థులు పదాలు రాశారు. లైవ్ ద్వారా పరీక్ష కావడంతో చిన్నారులు సంతోషంగా పాల్గొన్నారు. పరీక్షను సాక్షి రీజనల్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఐరిస్, పారమిత విద్యాసంస్థల అధినేత ప్రసాద్‌రావు పర్యవే క్షించారు. కార్యక్రమంలో సాక్షి డెప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్, ఇండియా స్పెల్‌బీ ప్రతినిధి సాయినాథ్‌రెడ్డి, ఐరిస్ పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్‌దత్త, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు -
సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన
వైవీయూ, న్యూస్‌లైన్: కడపలోని ప్రభుత్వ పురుషుల కళాశాల ఆడిటోరియల్ ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివా రం నిర్వహించిన ఇండియా స్పెల్ బీ జోనల్ స్థాయి కాంపిటీషన్‌కు విశేష స్పందన లభించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా విభజించి నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతం గా ముగిసింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ పురుషుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవికుమార్ మాట్లాడారు. పోటీ పరీక్షల విధానంలో స్పెల్‌బీని నూతన విప్లవంగా ఆయన అభివర్ణించారు. అనంతరం పరీక్షను ప్రారంభించారు. ‘సాక్షి’ ఛానల్లో ప్రత్యక్ష ప్రసార విధానంలో స్పెల్ బీ ప్రతినిధి స్పెల్లింగ్స్ చెబుతుండగా వారికి స్పెల్ బీ స్థానిక ప్రతినిధి, ఆంగ్ల పాఠ్యపుస్తక రచయిత, ఆంగ్లభాష స్టేట్ రిసోర్స్‌పర్సన్ అల్లం సత్యనారాయణ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెబుతూ వచ్చారు. దీంతో విద్యార్థులు పరీక్షను చక్కగా రాశారు. తొలుత నాల్గవ కేట గిరీ విద్యార్థులకు ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు, మొదటి కేటగిరీ 12.30 నుంచి ఒంటి గంట వరకు, రెండో కేటగిరీ మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు, మూడో కేటగిరీ సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొదటి కేటగిరీ 29 మంది, రెండో కేటగిరీకి 113 మంది, మూడో కేటగిరీ 137 మంది, నాలు గో కేటగిరీకి 113 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వైఎస్ఆర్ జిల్లాతో పాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లా ల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ కడప యూనిట్ మేనేజర్ డి.సుబ్బారెడ్డి, యాడ్స్ మేనేజర్ చాముండేశ్వరి పాల్గొన్నారు.