మహిళా లెక్చరర్ ఆత్మహత్య | Female lecturer suicide | Sakshi

మహిళా లెక్చరర్ ఆత్మహత్య

Nov 19 2014 3:00 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఓ మహిళా లెక్చరర్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అద్దంకి (సంతమాగులూరు) : ఓ మహిళా లెక్చరర్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ ల్యాబ్‌లో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కె.అంజనీదేవి(33) అనే మహిళ స్థానిక ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈమె స్వగ్రామం చీమకుర్తి. మూడేళ్ల క్రితం ఒంగోలుకు చెందిన దామా గోపీతో వివాహమైంది. ఏడాది నుంచి ఒంగోలు నుంచి రోజూ కళాశాలకు వచ్చి వెళ్లేవారు.

 ఈ నేపథ్యంలో భర్తతో విభేదాలు వచ్చాయి. ఆరు నెలల నుంచి పుట్టిల్లు చీమకుర్తి నుంచి రోజూ అద్దంకి వచ్చి వెళ్తున్నారు. పది రోజుల క్రితం కళాశాల యాజమాన్యాన్ని కలిసి తాను రోజూ చీమకుర్తి నుంచి వచ్చి వెళ్లడం ఇబ్బందిగా ఉందని, పట్టణంలో వసతి చూసుకునేంత వరకూ రాత్రి వేళల్లో కళాశాలలోనే ఉంటానని కోరారు. అందుకు యాజమాన్యం అంగీకరించింది. అప్పటి నుంచి అంజనీదేవి ఫిజిక్స్ ల్యాబ్‌లోని ఓ గదిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నివాసం ఉంటున్న గది మంగళవారం తెరుచుకోలేదు. కళాశాల సిబ్బందికి అనుమానం వచ్చి గదిని బలవంతంగా తెరిచి చూడగా ఆమె ఫ్యాన్‌కు నిర్జీవంగా వేలాడుతూ కనిపించారు.

కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి ఎస్సై శివకుమార్‌లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరకున్నారు. ఆమె మృతదేహాన్ని కిందికి దించి వివరాలు సేకరించారు. అంజనీదేవి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6.20 గంటలకు ఆమె తన తండ్రితో మాట్లాడినట్లు రికార్డయి ఉంది. లెక్చరర్ ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement