నాగినేని వెంకయ్య (మాజీ ఎమ్మెల్యే), జాగర్లమూడి రాఘవరావు (మాజీ ఎమ్మెల్యే), కరణం బలరామకృష్ణమూర్తి (మాజీ ఎమ్మెల్యే), గొట్టిపాటి, బాచిన
సాక్షి, అద్దంకి (ప్రకాశం): అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం.. రాజకీయంగా రాష్ట్రవ్యాప్తంగా పేరున్న ప్రాంతం. రసవత్తర రాజకీయాలకు ఇక్కడ పెట్టింది పేరు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించింది. అనంతరం జరిగిన పరిణా మాలు కూడా వైఎస్సార్ సీపీకే అనుకూలంగా ఉండటంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీనే విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా వైఎస్సార్ సీపీకి కంచుకోటగా అద్దంకి మారడం తథ్యమని అంటున్నారు.
1955 నుంచి 13 సార్లు ఎన్నికలు...
అద్దంకి నియోజకవర్గం 1955లో జనరల్ కేటగిరి నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ మూడుసార్లు గెలుపొందింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. ఇక్కడ మొదటిసారి 2014లో పోటీచేసిన వైఎస్సార్ సీపీ.. టీడీపీపై గెలుపొంది పార్టీ సత్తా చాటారు. గతంలో 95 శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2014 ఎన్నికల్లో పూర్తిగా వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకుగా మారింది. గతంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచినా.. రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ కనుమరుగైన నేపథ్యంలో ప్రస్తుతం ఆ స్థానాన్ని వైఎస్సార్ సీపీ దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ–టీడీపీ మధ్యే ప్రధాన పోటీ...
వచ్చే నెల 11న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ సీపీ–టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే రవికుమార్ అనంతరం టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ తరఫున అతనే పోటీ చేస్తుండగా, వైఎస్సార్ సీపీ తరఫున సీనియర్ నాయకుడు బీసీహెచ్ గరటయ్య బరిలో ఉన్నారు. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపు సునాయాసమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దీనికితోడు గతంలో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన గరటయ్య.. రెండు సార్లు పార్టీ నుంచి టికెట్ దక్కకపోయినప్పటికీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల హవా కొనసాగుతున్న సమయంలోనూ ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ప్రభావంతో పాటు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ హవాతో గరటయ్య విజయం ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
నియోజకవర్గ సంఖ్య | 105 |
పోలింగ్ కేంద్రాలు | 29,532 |
సమస్యాత్మక ప్రాంతాలు | 39 |
మొత్తం ఓటర్లు | 2,27,795 |
పురుషులు | 1,12,325 |
స్త్రీలు | 1,15,457 |
థర్డ్ జండర్ | 13 |
నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ఫలితాల వివరాలు...
ఎన్నికల సంవత్సరం | గెలిచిన అభ్యర్థి, పార్టీ | ప్రత్యర్థి, పార్టీ | మెజార్టీ |
1955 | నాగినేని వెంకయ్య (కేఎల్‌పీ) | పాటిబండ్ల రంగనాయకులు (సీపీఐ) | 6,828 |
1962 | పాటిబండ్ల రంగనాయకులు (సీపీఐ) | పచ్చవ అప్పారావు (కాంగ్రెస్) | 3772 |
1967 | దాసరి ప్రకాశం (కాంగ్రెస్) | నాగినేని వెంకయ్య (ఎస్‌డబ్ల్యూఏ) | 2,068 |
1972 | దాసరి ప్రకాశం (కాంగ్రెస్) | నర్రా సుబ్బారావు (ఇండిపెండెంట్) | 9,082 |
1978 | కరణం బలరామకృష్ణమూర్తి (కాంగ్రెస్) | బాచిన చెంచుగరటయ్య (జేఎన్‌పీ) | 5,150 |
1983 | బాచిన చెంచుగరటయ్య (ఇండిపెండెంట్) | కరణం బలరాం (ఇండిపెండెంట్) | 3,394 |
1985 | బాచిన చెంచుగరటయ్య (టీడీపీ) | జాగర్లమూడి హనుమయ్య (కాంగ్రెస్) | 5,560 |
1989 | జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) | బాచిన చెంచుగరటయ్య (టీడీపీ) | 7,082 |
1994 | బాచిన చెంచుగరటయ్య (ఇండిపెండెంట్) | జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) | 7049 |
1999 | బాచిన చెంచుగరటయ్య (టీడీపీ) | జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) | 249 |
2004 | కరణం బలరాం (టీడీపీ) | జాగర్లమూడి రాఘవరావు (కాంగ్రెస్) | 2,790 |
2009 | గొట్టిపాటి రవికుమార్ (కాంగ్రెస్) | కరణం బలరాం (టీడీపీ) | 15,764 |
2014 | గొట్టిపాటి రవికుమార్ (వైఎస్సార్ సీపీ) | కరణం వెంకటేశ్ (టీడీపీ) | 4,235 |
Comments
Please login to add a commentAdd a comment