సాక్షి, అద్దంకి (ప్రకాశం): ఐదేళ్లు మనలను పాలించే ప్రజాప్రతినిధులను ఈ ఒక్కరోజు మనం పాలించే రోజు. మన పాలకులను మనమే ఎన్నుకునే రోజు. అభివృద్ధికి పాటుపడని వ్యక్తిని మన ఓటు ద్వారా వ్యతిరేకించి రోజు. మనకు నచ్చిన వ్యక్తిని ఓటు ద్వారా అదే ఓటు ద్వారా ప్రజాప్రతినిధిగా ఎన్నుకునే రోజు రానే వచ్చింది. అవినీతి రహిత పాలనకు పట్టం కట్టే సమయం ఆసన్నమైంది. మన ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఓటేద్దాం. ఒక్క ఓటూ బీరు పోకుండా పోల్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఓటు వేసే ముందు ఐదేళ్ల పాటు ప్రజల సంక్షేమం కోసం పోరాడిని వైఎస్సార్ సీపీ ఉద్యమాలను, సామాన్యులపై టీడీపీ నియమించిన జన్మభూమి కమిటీలు పెత్తనాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోండి.
వచ్చే ఐదేళ్లలో అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించడానికి నడుం బిగించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గరటయ్య ఓటేసి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలను అనుభవిద్దాం. ఐదేళ్ల తరువాత అభివృద్ధి చెందిన అద్దంకిని చూసుకుందాం. ప్రతిపక్షంలో ఉండి కూడా ఐదేళ్ల పాటు ప్రజల సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాటాలు సాగించింది. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో చూసిన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానమని హామీ ఇచ్చారు.
సామాన్యులపై తెలుగు తమ్ముళ్ల అరాచకం
♦ నియోజకవర్గంలో 2014 నుంచి 2019 ఎన్నికల వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేకపోయింది.
♦ జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు పథకాలు అందకుండా చేసింది. ఇసుకను దోచుకుంది. నీరు చెట్టు పేరుతో అవినీతికి పాల్పడింది.
♦ బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఎమ్మెల్యే రవికుమార్ అగ్రహారం భూములను సాగు చేసుకునే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానన్న హామీ నెరవేర్చలేకపోయారు.
♦ పట్టణ పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తానన్న ఎమ్మెల్యే హామీ నెరవేరలేదు. ఖాళీగా ఉన్న చోట పేదలు గుడిసెలు వేసుకుంటే జైలులో పెట్టించిన ఘనత ఎమ్మెల్యే రవికుమార్‌కే దక్కుతుంది.
♦ అధికారం ఉన్నా కరణం, గొట్టిపాటి వర్గ రాజకీయాలతో నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడేలా చేసిన పేరుంది.
♦ ఐదు మండలాల్లో వర్గ రాజకీయాలతో రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయ అధికారులపై తమ పనులు చేయాంటూ ఒత్తిళ్లు తెచ్చి వారిని వేధించిన ఘనత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు చెందుంతుంది.
♦ బల్లికురవ మండలంలో కరణం, గొట్టిపాటి వర్గ రాజకీయాలతో మూడు సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన యూనిట్లు ఇప్పటికీ గ్రౌండింగ్ కాలేదు.
♦ బల్లికురవ మండలం వల్లాపల్లిలో భర్త బతికుండగానే మహిళలకు వితంతు పింఛన్లు తెప్పించిన ఘనత తెలుగు తమ్ముళ్లకే చెందుంతుంది.
♦ సమస్యలతో అల్లాడుతున్న ప్రజలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
♦ భవనాశి రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు.
♦ ఈ ఐదేళ్ల పాలనలో రైతులను ఆదుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే ఏ మాత్రం సహకరించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రజా సంక్షేమం కోస పోరాటం
♦ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన వ్యర్తిగా గుర్తింపు పొందారు.
♦ పార్టీ తరుపున అద్దంకిలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా గరటయ్య ప్రతిపక్షం ఆగడాలను ఎండగడుతూ ప్రలజకు వెన్ను దన్నుగా నిలిచారు.
♦ ప్రత్యేక హోదా సాధన కోసం ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఐదేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు.
♦ నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి ఇబ్బందులపై అధికారులను నిలదీయడం, సంబంధిత సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కారం కోసం కృషి చేశారు. ప్రజా సమస్యలను పరిష్కారానికి గరటయ్య నిరంతరం కృషి చేశారు.
♦ ప్రతిపక్షం తలపెట్టిన ప్రతి ఉద్యమాన్ని విజయవంతం చేశారు.
♦ అధికార పక్షం చేపట్టిన నీరు చెట్టు, ఇసుక అక్రమాల అవినీతీని ప్రజల్లో ఎండగట్టాడు.
♦ అధికార పక్షం ప్రభుత్వ పథకాల్లో పచ్చ చొక్కాలకే ప్రాధాన్యం ఇస్తుందన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment