
గరటయ్య ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు
సాక్షి, వెల్లలచెరువు (ప్రకాశం): టీడీపీ పార్టీ నాయకులు దౌర్జన్యం, అరాచకానికి అడ్డే లేకుండాపోతుంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య మంగళవారం సాయంత్రం మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కొంచెం సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెల్లలచెరువులో సొసైటీ భవనానికి సమీప బజారులో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రచారానికి రావటంతో టీడీపీకి చెందిన చింతా రామారావు వర్గం రోడ్డుమీద అడ్డంగా నిలబడి వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రచారాన్ని ప్రశాంతంగా చేసుకోవడానికి సహకరించాలని టీడీపీ నాయకులను కోరినప్పటికీ వారు ఏ మాత్రం సహకరించకపోగా, గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి ఇరువర్గాలను చెదరకొట్టారు.
టీడీపీకి సపోర్టు చేసిన పోలీసులు
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి అడ్డుకున్న టీడీపీ నాయకులను చెదరకొట్టినట్లే కొట్టి మళ్లీ పోలీసులు వారిని అక్కడే ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు. కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే ప్రచారం చేయకుండా వెళ్లగొట్టారు.
పోలింగ్ రోజు పరిస్థితి ఏంటి?
ఎన్నికల ప్రచారంలోనే టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యం చేసిన సంగంతి తెలిసిందే.. గురువారం జరిగే ఎన్నికలు రోజు మాత్రం పోలీంగ్ పరిస్థితి ఏమిటని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి దౌర్జన్యాలు చోటుచేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుల కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment