ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని, హోదా వల్ల రాయితీలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని, ఊసరవెల్లికే రంగులు మార్చడం నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. హోదా కోసం ఆఖరిఅస్త్రంగా మంత్రులతో రాజీనామా చేయిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.. కానీ ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి కనుక ఆఖరి అస్త్రంగా కాకుండా మొదటి అస్త్రంగానే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.