ఈనెల 31 దరఖాస్తులకు తుది గడువు
అద్దంకి : జిల్లాలోని గురుకుల బాలికల కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శింగరాయకొండ, కంభం, మార్కాపురం, అద్దంకి, యద్దపూడి, కొండపి, రాచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు 640 సీట్లు, దూపాడు, నాగులపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలల్లో ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో ఇంటరు మొదటి సంవత్సరంలో చేరేందుకు 160 సీట్లు ఖాళీగా ఉన్నట్లు సింగరకొండ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ , ఇంటరు ప్రవేశ కౌన్సిలింగ్ కో ఆర్డినేటరు పరుచూరి వాసవి మంగళవారం తెలియజేశారు.
వీటిని కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు ఫారాలు సమీపంలో ఉన్న ఏ గురుకుల కళాశాల నుంచైనా పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలతోపాటు పదో తరగతి మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు జెరాక్స్‌లను జతచేసి ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా అందజేయాలని తెలిపారు.
మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థుల కోసం జూన్ 6వ తేదీన ఉదయం 10 గంటలకు అద్దంకిలోని సింగరకొండ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే సమయంలో విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని కోరారు.
దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు..
* ఈ సంవత్సరం పదో తరగతి పాసై ఉండి 2016 ఆగ స్టు 16 నాటికి 17 సంవత్సరాల వయసు లోపు వారై ఉండాలి.
* తల్లిదండ్రుల సంవత్సరాదాయం ఒక లక్షకు మించి ఉండరాదు.
* ప్రకటించిన సీట్లలో 75 శాతం ఎస్సీలకు, ఎస్సీ కన్వనర్టెడ్ క్రిస్టియన్లకు 12 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం 9704550083, 9704550087, 9704550088, 9704550089, 9704550090, 9704550091, 9704550092, 9704550093, 9704550094, 9704550095 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
గురుకుల బాలికల కళాశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం
Published Wed, May 18 2016 9:26 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement