ప్రకాశం (అద్దంకి) : అద్దంకిలోని సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన పోకూరి రామేశ్వరరావు అనే ఎన్నారై జేబులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పర్సు చోరీ చేశారు. ఆ పర్సులో రూ.15 వేల నగదు, రూ.25 వేల విలువైన అమెరికన్ డాలర్లతో పాటు ట్రైన్ టికెట్లు కూడా ఉన్నాయి. బాధిత ఎన్నారై ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.