బైకు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి
Published Sat, Apr 15 2017 9:20 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
అద్దంకి రూరల్ (ప్రకాశం జిల్లా) : బైకు మీదనుంచి జారి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని యార్కెట్ యార్డు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. పట్టణంలోని రామ్‌నగర్ పుట్ట వద్ద నివాసం ఉంటున్న ఉసురుపాటి రాములు (40) కోరిశపాడు మండలం మద్దిపాడు పోలీస్‌స్టేషన్ లో కానిస్టేబులుగా పని చేస్తున్నాడు.
మృతుని స్వస్థలం జె.పంగులూరు మండలం టీ. కొప్పెరపాడు గ్రామం ఉద్యోగ రీత్యా అద్దంకిలో 4 సంవత్సరాలనుంచి నివాసం ఉంటున్నాడు. మద్దిపాడులో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేందుకు రోజు అద్దంకి నుంచి బైకుపై మద్దిపాడు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం అద్దంకి నార్కేట్‌పల్లి రాష్ట్రీయ రహదారి పట్టణంలోని మార్కెట్ యార్డుకు సమీపంలోకి రాగానే బైకు మీద నుంచి జారిపడి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు తెలియజేయగా ఎస్‌ఐ రహమాన్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని మృత దేహాన్ని స్థానిక వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement
Advertisement