
సాక్షి, కృష్ణా: మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్సార్‌సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధం అంటే బాగుంటుందంటూ చురకలంటించారాయన.
మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నారు. ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటున్నారు. మరి మీరు దేనికి సిద్ధం?. మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా?. క్యాండిడేట్లను పెట్టరా? ఫ్లెక్సీలే పెడతారా?. మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అని పవన్‌కు సూచించారాయన.
Comments
Please login to add a commentAdd a comment