సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు.
కాగా.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.
కంచు కోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్సార్‌సీపీ ఎంచుకుంటోంది. భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైఎస్సార్‌సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం.
నాలుగు ముఖ్యమైన రీజియన్‌లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్సార్‌సీపీ.
ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment